: తమిళనాడు రాజకీయ పరిస్థితులపై వర్మ సెటైర్లు
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి దర్శకుడు రాంగోపాల్ వర్మ. తాజాగా, ఆయన తమిళనాడు రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అందుకు ట్విట్టర్ ను వేదికగా చేసుకున్నారు. జయలలిత జైలుపాలైన నేపథ్యంలో, తమిళనాడు రాజధాని బెంగళూరు అనుకోవాల్సి వస్తోందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం జయ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉన్నారు. దీంతో, తమిళనాడు ప్రభుత్వం, అధికార గణం బెంగళూరులోనే మకాం పెట్టిందని వర్మ వ్యాఖ్యానించారు. తమిళనాడు సచివాలయం పరప్పణకు తరలించేశారని పేర్కొన్నారు. భారతదేశం అంతా ఒక్కటిగానే ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని వర్మ సెటైరికల్ ధోరణిలో ట్వీట్ చేశారు.