: కష్టాలెదురైనా రుణమాఫీ చేసి తీరుతాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీకి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల కష్టాలు చూసే ఆ హామీ ఇచ్చామని చెప్పారు. రుణమాఫీకి అన్ని మార్గాలను, వనరులను పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పథకాలను పారదర్శక రీతిలో ఆన్ లైన్ లో పెట్టాలనుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖకు చెందిన పదివేల ఫీడర్లున్నాయని, వాటి వివరాలను ఆన్ లైన్ లో ఉంచుతున్నామని చెప్పారు. ఇకపై, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిని ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని బాబు వివరించారు.