: స్పాట్ ఫిక్సింగ్ లో ఆ ఇద్దరూ కీలక పాత్రధారులు: ఢిల్లీ కోర్టు


ఐపీఎల్ ఆరవ సీజన్ లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లు కీలక పాత్ర పోషించారని ఢిల్లీ కోర్టు పేర్కొంది. దర్యాప్తులో ఈ విషయం స్పష్టమైందని తెలిపింది. వీరిద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ సందర్భంగా పోలీసులు తమ వాదనల్లో భాగంగా... దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ 1993 ముంబయి పేలుళ్ళ తర్వాత భారత్ లో అడుగుపెట్టలేదని కోర్టుకు తెలిపారు. కాగా, ఈ ఫిక్సింగ్ స్కాంలో క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ తదితరులు విచారణను ఎదుర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News