: ఎన్డీఏ నుంచి బయటికి రావడం లేదు: ఉద్ధవ్ థాకరే


మహారాష్ట్రలో శివసేన-బీజేపీ మిత్రభేదం నేపథ్యంలో... తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అనంత్ గీతే రాజీనామా చేస్తారని శివసేన పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తాజాగా మాట మార్చారు. ప్రస్తుతానికి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చే ప్రతిపాదనగానీ, నిర్ణయంగానీ లేవన్నారు. ఒకవేళ తాము ఎన్డీఏ నుంచి నిష్క్రమించాలనుకుంటే మహారాష్ట్రకు చెందిన 42 మంది ఎంపీలు రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు. ఎందుకంటే వారంతా ఎన్డీఏ అభ్యర్థులుగా ఎన్నికయ్యారని ఉద్ధవ్ చెప్పారు. ఒకవేళ బయటికి రావాలని భావిస్తే, ప్రధాని మోడీతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News