: పోర్చుగల్ పీఎం రేసులో భారత సంతతి పొలిటీషియన్


గోవా మూలాలున్న భారత సంతతి రాజకీయవేత్త ఆంటోనియో కోస్టా (52) పోర్చుగల్ ప్రధానమంత్రి రేసులో ఉన్నారు. పోర్చుగల్ లో కోస్టాను 'గాంధీ ఆఫ్ లిస్బన్' అని పిలుస్తారు. ఈ విలక్షణ రాజకీయవేత్త పూర్వీకులు గోవాలోని పోర్చుగీసు కాలనీకి చెందినవారు. అప్పట్లో పోర్చుగీసు వారు గోవా చేరుకుని అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం కోస్టా లిస్బన్ మేయర్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన విపక్ష సోషలిస్టు పార్టీ సభ్యుడు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు గాను సోషలిస్టు పార్టీ కోస్టాను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ప్రధాని అభ్యర్థిత్వం కోసం పార్టీలో అంతర్గతంగా జరిగిన ఎన్నికల్లో కోస్టా మరో నేత ఆంటోనియో జోస్ సెగురోను ఓడించారు.

  • Loading...

More Telugu News