: ఏపీ ఐటీ విధానాల పట్ల సత్య నాదెళ్ల ఆకర్షితులయ్యారు: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ఐటీ విధానాల పట్ల మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆకర్షితులయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాజాగా తనను కలసినప్పుడు సత్య ఈ మాట చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమెరికాలోని వైద్యుల్లో ఎక్కువ ఏపీ వాళ్లే ఉన్నారని, వారిలో గుంటూరు వాళ్లే అధికంగా ఉన్నారనీ అన్నారు. విభజన తరువాత సెంటిమెంట్ కు ఏమంత ప్రాధాన్యత ఉండదన్న చంద్రబాబు, ఇప్పుడు ప్రజలు కోరుకుంటోంది అభివృద్ధి అని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధే అజెండా కావాలని సూచించారు.

  • Loading...

More Telugu News