: కుక్కల బోనులోకి నాలుగేళ్ల విద్యార్థి: క్లాస్ లో మాట్లాడినందుకు టీచర్ శిక్ష


అప్పుడప్పుడే బడిబాట పడుతున్న నాలుగేళ్ల బాలుడు తరగతి గదిలో మాట్లాడాడట. అంతే, అతడి టీచర్ అంతెత్తున ఎగిరిపడింది. తరగతి గదిలో అల్లరి చేస్తే సహించేది లేదంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. ఎదురుగా కనిపించిన కుక్కల బోనులోని కుక్కను బయటకు వదిలేసి, అల్లరి చేసిన బాలుడిని అందులోకి నెట్టేసింది. కుక్క ఉండాల్సిన బోనులో తన తమ్ముడు ఉన్నాడేమిటా? అంటూ ఆరా తీసిన ఆ బుడతడి సోదరి పాఠశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసింది. వింత శిక్షలేసే ఉపాధ్యాయురాలిని మందలించాల్సిన ఆ ప్రిన్సిపల్, ఫిర్యాదు చేసిన బాలికనే బెదిరించింది. ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించింది. అయితే మరునాడు పాఠశాలకు వెళ్లమని మొండికేసిన అక్కా తమ్ముళ్లను వారి తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రిన్సిపల్ శశికళను అరెస్ట్ చేయగా, టీచర్ దీపిక మాత్రం పరారీలో ఉందట. తిరువనంతపురంలోని జవహర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఇటీవల చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. వింత శిక్షలేసిన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News