: అమెరికా ధనవంతుల జాబితాలో ఐదుగురు ప్రవాస భారతీయులు!


ఫోర్బ్స్ మేగజీన్ ప్రకటించిన అమెరికా కుబేరుల జాబితాలో ఐదుగురు ప్రవాస భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఈ ఏడాది కూడా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ జాబితాలో ఆయన ప్రథమ స్థానంలో ఉండటం వరుసగా ఇది 21వ సారి. ఇక ఈ జాబితాలోని ప్రవాస భారతీయుల విషయానికొస్తే, ప్రముఖ ఔట్ సోర్సింగ్ సంస్థ సింటెల్ అధిపతి భరత్ దేశాయ్ 255 స్థానాన్ని దక్కించుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్త జాన్ కపూర్ (261), సింఫనీ టెక్నాలజీ వ్యవస్థాపకుడు రమేశ్ వాద్వానీ (264), సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారుడు కవితార్క్ రామ్ శ్రీరామ్ (350), వెంచర్ కేపిటలిస్ట్ వినోద్ ఖోస్లా (381) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకెర్ బర్గ్ ఈ జాబితాలో 11వ స్థానంలో నిలిచినా, అత్యధిక మొత్తంలో డాలర్లను సంపాదిస్తున్న వారిలో అగ్రగణ్యుడిగా ఎదిగారు.

  • Loading...

More Telugu News