: త్వరలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం


తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చబోతోంది. ఈ మేరకు తొలివిడతగా 462 మంది అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తూ రూపొందించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు జిల్లాల వారీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే తొలి విడతలో సాయం అందుకునే వారి పేర్లను జిల్లాల వారీగా కలెక్టర్లు ఖరారు చేశారు.

  • Loading...

More Telugu News