: భారతీయులు త్వరగా గుండె జబ్బులకు గురవుతున్నారు: అమెరికా పరిశోధన వెల్లడి


భారతీయులు త్వరగా గుండె జబ్బులబారిన పడుతున్నారు. గుండె జబ్బుల బారిన పడుతున్న సగటు భారతీయుడి వయసు 52 ఏళ్లే. అంటే, ఇతర దేశాలతో పొలిస్తే చిన్న వయసులోనే భారతీయులకు గుండె జబ్బులు సోకుతున్నాయని తేలుతోంది. అదిక రక్తపోటు, మధుమేహం, గుండె కవాటాలు మూసుకుపోవడం తరహా లక్షణాలు భారతీయుల్లో అధికంగా కనిపిస్తున్నాయని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధనలో తేలింది. భారత్ లోని ముంబై నుంచి పాట్నా దాకా దాదాపు 26 నెలల పాటు 85,295 మంది రోగులను పరిశీలించిన మీదట ఆ సంస్థ ఈ అభిప్రాయానికి వచ్చింది. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని సోమవారం ఈ నివేదిక వెల్లడైంది. అమెరికాలో గుండె వ్యాధులకు గురవుతున్న వారి సగటు వయసు 70 ఏళ్లుగా ఉందని సర్వేలో పాల్గొన్న హీరనందిని ఆస్పత్రి కార్డియాలజీ విభాగం అధిపతి గణేశ్ కుమార్ చెప్పారు. మధుమేహం భారతీయుల గుండె జబ్బులకు ప్రధాన కారణంగా నిలుస్తోందని ఈ సర్వే వెల్లడించింది.

  • Loading...

More Telugu News