: దుర్గామాతను దర్శించుకున్న కేంద్ర మంత్రి అశోక్
కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ఆలయ సిబ్బంది లాంఛనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు.