: మొత్తానికి 'ఆర్కుట్'ను నేడు మూసేసిన గూగుల్


మొత్తానికి ఆర్కుట్ వెబ్ సైట్ కు నేడు అధికారికంగా తెరపడినట్లు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ధ్రువీకరించింది. ఇండియా, బ్రెజిల్ లో అత్యంత పాప్యులర్ అయిన ఈ సోషల్ మీడియా... ఫేస్ బుక్, ట్విట్టర్ ఇతర వెబ్ సైట్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ నేపథ్యంలో మూసివేతకు దారి తీసింది. "గత దశాబ్దంలో యూట్యూబ్, బ్లాగర్, గూగుల్+ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మూలకూ వ్యాపించాయి. ఈ సమూహాలకు పెరిగిన ఆదరణతో 'ఆర్కుట్' వృద్ధి క్షీణించింది. అందుకే దానికి ఉద్వాసన పలకాలని నిర్ణయించాము" అని గూగుల్ తన బ్లాగ్ లో పేర్కొంది. 2004లో ఆర్కుట్ ప్రారంభమవగా, అదే ఏడాది ఫేస్ బుక్ స్థాపించబడింది. ప్రస్తుతం 'ఎఫ్ బీ' 1.28 బిలియన్ ఖాతాదారులతో ప్రపంచంలో అతిపెద్ద సామాజిక నెట్వర్క్ గా వ్యాపించింది.

  • Loading...

More Telugu News