: త్వరలో తెలంగాణలోని పోస్టాఫీసుల్లో రెవెన్యూ స్టాంపులు
తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో రెవెన్యూ స్టాంపులను విక్రయించాలని నిర్ణయించింది. దీంతో, రెవెన్యూ స్టాంపులకు కృత్రిమ కొరత సృష్టించడం, బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకోవడం వంటి అరాచకాలకు చెక్ పడనుంది. దీనికోసం, తెలంగాణలోని పోస్టల్ శాఖకు రూ. 5 కోట్ల వరకు క్రెడిట్ పై రెవెన్యూ స్టాంపులను అందించాలని టీఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.