: ఏపీ ఐటీ కేంద్రంగా విశాఖ!


రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోని విశాఖపట్టణం ఐటీ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఐటీ కంపెనీల అధిపతుల సమావేశంలో భాగంగా ఈ దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి భేటీలోనే 20 కంపెనీలతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకోగలిగారు. దాదాపు రూ.1,570 కోట్ల విలువ చేసే ఈ ఒప్పందాలతో విశాఖ రూపురేఖలు మారిపోనున్నాయి. నగరంలోని రుషికొండ ఐటీ సెజ్ లో కొత్తగా ఏర్పాటు కానున్న ట్రిప్ (టెక్నాలజీ రిసెర్చీ అండ్ ఇంక్యుబేషన్ పార్కు) సరికొత్త అధ్యాయానికి తెర లేపనుంది. సోమవారం ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలకు సంబంధించి విప్రో, టెక్ మహీంద్ర తరహా దేశీ దిగ్గజాలతో పాటు గూగుల్ ల ప్రాజెక్టులున్నాయి. ఈ కంపెనీల ఒప్పందాలు కార్యరూపం దాల్చేలోగా మరిన్ని కంపెనీలు ముందుకు రావడం ఖాయమని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచంలోని ఐటీ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించేందుకు చంద్రబాబు చర్యలు ముమ్మరమయ్యాయి. రానున్న రెండు, మూడేళ్లలో ఏపీలో విశాఖ, ఐటీ హబ్ గా మారడం ఖాయమని సోమవారం నాటి భేటీకి హాజరైన పలు కంపెనీల ప్రతినిధులు చెప్పారు.

  • Loading...

More Telugu News