: కిటకిటలాడుతున్న తిరుమల క్షేత్రం
తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆ కాంప్లెక్స్ కు వెలుపల ఇంకా రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరి ఉన్నారు. అటు, 30 వేల మంది భక్తులు కాలినడకన కొండపైకి చేరుకున్నారు. ఉచిత దర్శనానికి 28 గంటల సమయం పడుతోండగా, కాలినడక భక్తులకు 18 గంటలు పడుతోంది.