: రేపు చెన్నైలో సినిమా పరిశ్రమ నిరాహార దీక్ష
అన్నా డీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ మంగళవారం నాడు చెన్నైలో నిరాహార దీక్ష చేపట్టనుంది. ఒక్కరోజు పాటు చేపట్టే ఈ దీక్షలో పరిశ్రమకు చెందిన అన్ని విభాగాలకు చెందినవారు పాల్గొంటున్నారు. రేపు తమిళనాట థియేటర్లలో షోలు రద్దు చేయాలని డిస్ట్రిబ్యూటర్ల సంఘం నిర్ణయించింది. జయలలితకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ళ జైలుశిక్ష విధించడం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు.