: అక్టోబరు 2 నుంచి ఏపీలో పింఛన్ల పెంపు అమల్లోకి


ఆంధ్రప్రదేశ్ లో అక్టోబరు 2 నుంచి పింఛన్ల పెంపు అమల్లోకి రానుంది. ఈ మేరకు 40 నుంచి 79 శాతం అంగవైకల్యం ఉన్నవారికి రూ.500 నుంచి రూ.వెయ్యికి పింఛను పెంచారు. 80 శాతం పైబడి అంగవైకల్యం ఉన్నవారికి రూ.1500 పింఛను... వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచారు. అదే రోజు నుంచి 20 వరకు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటనలు ఉంటాయి. విజయవాడలో 'జన్మభూమి-మా ఊరు' పథకాన్ని అక్టోబరు 2నే ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News