: ముంబయి 'సూపర్ కాప్' హేమంత్ కర్కరే భార్య మృతి


ముంబయి నగరంపై 2008 నవంబర్ 26న పాకిస్థాన్ కు చెందిన టెర్రరిస్టులు విచక్షణ రహితంగా విరుచుకుపడి వందలాది మందిని బలిగొనడం తెలిసిందే. అజ్మల్ కసబ్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ముంబయి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే ప్రాణాలు వదిలారు. తాజాగా, ఆయన భార్య కవితా కర్కరే (57) బ్రెయిన్ హెమరేజ్ కారణంగా తుదిశ్వాస విడిచారు. సెంట్రల్ ముంబయిలోని నివాసంలో కవిత అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో ఆమెను శనివారం ఉదయం పీడీ హిందూజా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆమె చికిత్సకు స్పందించకపోవడంతో, సోమవారం ఉదయం 'బ్రెయిన్ డెడ్' అని ప్రకటించారు. తల్లి అవయవాలను దానం చేసేందుకు ఆమె ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అంగీకరించారని ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. కవిత ముంబయిలోని ఓ బీఈడీ కళాశాలలో ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించేవారు. కొంతకాలంగా ఆ విధులకు దూరంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News