: 'పంజాబ్' బ్యాట్స్ మన్ మాక్స్ వెల్ కు మందలింపు


చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో భాగంగా ఆదివారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కేప్ కోబ్రాస్ జట్ల మధ్య మొహాలీలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ 23 పరుగులు చేసి అవుటయ్యాడు. అవుటై పెవిలియన్ కు మరలి వెళ్ళే క్రమంలో తీవ్ర అసహనానికి గురైన మాక్స్ వెల్, బౌండరీ లైన్ వద్ద బ్యాట్ తో దేన్నో కొట్టిన దృశ్యం కెమెరాకు చిక్కింది. దీన్ని లెవల్ 1 తప్పిదంగా భావించిన మ్యాచ్ రిఫరీ మందలింపుతో సరిపెట్టాడు. ఐసీసీ నియమావళి ప్రకారం ఆర్టికల్ 1.2 అనుసరించి... క్రికెట్ ఉపకరణాలను, దుస్తులను, గ్రౌండ్ లో ఉన్న ఇతర పరికరాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం శిక్షార్హం.

  • Loading...

More Telugu News