: మా దేవుడు సూపర్ రిచ్: చంద్రబాబు


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో జరిగిన సీఈవోల సదస్సులో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడున్నాడని, రూ.8,500 కోట్ల డిపాజిట్లు, 5 వేల కిలోల బంగారం... ఇంకా ఎన్నో విలువైన ఆస్తులను ఆయన కలిగి ఉన్నాడని పరోక్షంగా తిరుమల వెంకటేశ్వరుడి ప్రస్తావన తెచ్చారు. తిరుమలను ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక, హైదరాబాదు అభివృద్ధికి తొమ్మిదేళ్ళు పట్టిందని, అదే, విశాఖను నాలుగేళ్ళలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఐటీకి సింబల్ గా హైదరాబాదులో హైటెక్ సిటీని నిర్మించామని, ఇప్పుడు విశాఖలో ఐటీకి సింబల్ గా మధురవాడలోని సిగ్నేచర్ టవర్స్ ఉంటుందని అన్నారు. ముంబయి తరహాలో విశాఖకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయని, తూర్పు తీరంలో చెన్నై, కోల్ కతా తర్వాత అతిపెద్ద నగరం విశాఖేనని బాబు పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News