: గూగుల్ తరహాలో ఏపీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది: చంద్రబాబు


గూగుల్ ఎలా అభివృద్ధి చెందిందో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రం అత్యంత వేగంగా డిజిటల్ ఏపీగా మారిపోతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని సీఎం నొక్కి చెప్పారు. ఆంధ్ర ప్రాంత వృత్తి నిపుణులు ప్రపంచంలోని ప్రతి దేశంలో, ప్రతి రంగంలో ఉన్నారని తెలిపారు. కాబట్టి, విద్యార్థులు తరగతి గదులకు పరిమితం కాకుండా వినూత్నంగా ఆలోచించాలని కోరారు. 'మేక్ ఇన్ ఇండియా' లాగే 'మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్' తమ లక్ష్యమని చెప్పారు. ఈ మేరకు విశాఖలో జరుగుతున్న ఐటీ సీఈవోల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ, విశాఖ అద్భుతమైన నగరమని, ప్రతి ఒక్కరూ ఈ నగరాన్ని ఒక్కసారి చూస్తే జీవితకాలం ప్రేమిస్తారని పేర్కొన్నారు. తూర్పు కోస్తాలో ఉత్తమమైన నగరం విశాఖపట్నమన్న బాబు, ఈ నగరాన్ని 'సిలికాన్ కారిడార్' గా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News