: జడ్పీ సమావేశంలో కడియం, ఎర్రబెల్లి మధ్య వాగ్వివాదం
టీఆర్ఎస్ ఎంపీ కడియం శ్రీహరి, తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఘర్షణ పడ్డారు. వరంగల్ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతపై ప్రతిపక్ష సభ్యులు అధికారులను సమావేశంలో ప్రశ్నించారు. ఇందుకు కడియం సమాధానం చెప్పేందుకు ప్రయత్నించగా, ఎంపీ జవాబు తమకు అవసరం లేదని ఎర్రబెల్లి అడ్డుకున్నారు. దాంతో, ఇద్దరూ వ్యక్తిగత దూషణలకు దిగారు. "టీఆర్ఎస్ లో చేరతానని నాకు ఫోన్ చేయలేదా?" అని కడియం ఎర్రబెల్లిని ప్రశ్నించారు. ఇక్కడ రాజకీయాలు వద్దని ఎర్రబెల్లి చెప్పారు.