: బ్లాక్ బెర్రీ ‘పాస్ పోర్టు’ ధర రూ.49,990!


బ్లాక్ బెర్రీ 'పాస్ పోర్టు'... విదేశీ యానాల్లో వెంట తీసుకెళ్లేది కాదు, తాజాగా మార్కెట్ లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్. ధర రూ.49,990. ఇందులో ప్రత్యేకత ఏముందంటారా? స్మార్ట్ ఫోన్లన్నీ ఇప్పటిదాకా దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నవే. బ్లాక్ బెర్రీ తాజాగా విడుదల చేసిన ఈ పాస్ పోర్టు, చతురస్రం మాదిరిగా పొడవుతో పాటు వెడల్పు కూడా ఒకే కొలతలతో ఉన్న స్మార్ట్ ఫోన్. గత గురువారం పాస్ పోర్టును విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన కెనడా మొబైల్ తయారీ దిగ్గజం బ్లాక్ బెర్రీ, తాజాగా భారత మార్కెట్ లోకి దానిని తీసుకొచ్చింది. నేటి నుంచి 'పాస్ పోర్టు' బుకింగ్ లు ప్రారంభమవుతున్నాయి. ఈ 'పాస్ పోర్టు'లు అక్టోబర్ రెండో వారం నుంచి వినియోగదారుల చేతుల్లో ఇమిడిపోనున్నాయి. ఒకప్పుడు బ్లాక్ బెర్రీ అంటే, అదో స్టేటస్ సింబల్ గా పరిగణించే వారు. యాపిల్, శాంసంగ్ ల రాకతో ఆ ప్రతిష్ఠ కాస్త తగ్గిపోయింది. అయితే, తిరిగి పునర్ వైభవం సాధించే దిశగా సరికొత్త తరహాలో మార్కెట్ లోకి దూసుకొచ్చేసింది. మరి ఈసారీ తన బ్రాండ్ ఇమేజ్ ను ఏ మేరకు నిలబెట్టుకుంటుందో వేచి చూద్దాం.

  • Loading...

More Telugu News