: ప్రమాణ స్వీకారం చేసిన పన్నీర్ సెల్వం


తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరి కొంత మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో వీరందరిచేత ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేస్తూ ఉద్వేగానికి లోనైన పన్నీర్ సెల్వం కంటతడి పెట్టారు. ఏ మాత్రం హడావుడి లేకుండా... చాలా సాధారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. ఇప్పటి వరకు సెల్వం జయ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 63 ఏళ్ల పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడం ఇది రెండో సారి. 2000లో భూ కుంభకోణం కేసులో జయ జైలుకు వెళ్లడంతో పన్నీర్ సెల్వం తొలిసారి సీఎం అయ్యారు.

  • Loading...

More Telugu News