: మోడీ తిరిగొచ్చాక రాజీనామా చేయనున్న శివసేన ఎంపీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చాక శివసేన ఎంపీ, కేంద్రమంత్రి అనంత్ గీతే రాజీనామా చేయనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ-శివసేన మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. దాంతో, ఇరవై ఐదేళ్ల కూటమి విచ్ఛిన్నమైంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో పదవి పొందిన అనంత్ వైదొలగనున్నారు.