: ఐసిస్ ను తక్కువగా అంచనా వేశాం: ఒబామా


ఇరాక్, సిరియాల్లో పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతున్న ఐసిస్ శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశామని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒప్పుకున్నారు. పతన దశలో ఉన్న సిరియా... జిహాదీ తీవ్రవాదులు ఏకమయ్యేందుకు స్థావరంగా మారుతుందని అంచనా వేయలేకపోయామని ఆదివారం సీబీఎస్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. భూమిపై జిహాదీలకు స్థావరమే లేకుండా చేసేందుకే సంకీర్ణ సైన్యాలతో కలిసి ఐసిస్ పై దాడులు జరుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా శిక్షణలో తయారైన ఇరాకీ బలగాలు తీవ్రవాదులను అణచివేయడంలో విజయం సాధిస్తాయని కూడా తాము అంచనా వేశామని, అయితే అందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయని ఒబామా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News