: కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన శంకర్రావు
ట్యాంక్ బండ్ పై సీమాంధ్రుల విగ్రహాలు అవసరం లేదని టీఎస్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శంకర్రావు తప్పుబట్టారు. సీమాంధ్రుల విగ్రహాలను తొలగించకుండానే తెలంగాణ వారి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయవచ్చని హితవు పలికారు. కేసీఆర్ వ్యాఖ్యలతో, చర్యలతో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని తెలిపారు. తెలుగు వారి మధ్య ఐక్యత లేకపోతే అభివృద్ధి కుంటుబడుతుందని అన్నారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు.