: ఎయిమ్స్ కు మారిన జైట్లీ, బుధవారం డిశ్చార్జ్


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం సూపర్ మ్యాక్స్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు మారారు. ఇటీవలే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకున్న జైట్లీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఎయిమ్స్ లోని కార్డియోథొరాసిక్, న్యూరో సైన్సెస్ విభాగంలో ఉంచిన జైట్లీని బుధవారం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ప్రస్తుతం జైట్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు... కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని జైట్లీకి సూచించారు.

  • Loading...

More Telugu News