: నిజామాబాద్ జిల్లాలో రైతుల రాస్తారోకో... భారీగా నిలిచిన వాహనాలు
తెలంగాణలో కరెంటు కష్టాలు రైతన్నలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. వారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకునేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం వాజేడు నగర్ లో రైతులు ఆందోళనకు దిగారు. తీవ్ర విద్యుత్ కోతలకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. రాస్తారోకో చేపట్టారు. దీంతో, రహదారిపై కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.