: త్వరలో వైద్యుల పోస్టుల భర్తీ: మంత్రి కామినేని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ ఉదయం కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆయన సందర్శించారు. హాస్పిటల్ లో ఉన్న వసతులను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు రాజ్యసభ టీడీపీ సభ్యుడు సీఎం రమేష్ కూడా ఉన్నారు.