: మళ్లీ మరాఠీ కార్డును చేతబట్టిన శివసేన!


మహారాష్ట్ర ప్రజలను తన వైపునకు తిప్పుకునేందుకు పలుమార్లు మరాఠీ కార్డును వాడుకున్న శివసేన, తాజాగా మరోమారు ఆ కార్డును చేతబట్టింది. బీజేపీతో 25 ఏళ్ల సుదీర్ఘ స్నేహానికి చెల్లుచీటి ఇచ్చిన ఆ పార్టీ, ఎన్నికల్లో లాభం పొందేందుకు ఈ దఫా మళ్లీ తమ పాత మంత్రదండాన్నే ఆశ్రయించింది. ప్రజల్లో భారీ ఇమేజ్ ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఢీకొట్టాలంటే, ఆ మాత్రం సాహసం చేస్తేనే కాని ఫలితం ఉండదని భావించిందో, ఏమో తెలియదు కాని, తాజాగా మరాఠీ కార్డును చేతబట్టింది. ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరూ గుజరాతీలని, వారు చెప్పిన వారికి ఓట్లేస్తే మరాఠీలుగా మునిగిపోతామని ప్రకటించింది. అయితే శివసేన ప్రచారాన్ని తప్పికొట్టేందుకు బీజేపీ కూడా తన స్థానిక నేతలను రంగంలోకి దించింది. బీజేపీలో ప్రధాన పదవుల్లో మరాఠీలు కొనసాగుతున్నారని, శివసేన వాదిస్తున్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదని కూడా బీజేపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నిస్ ప్రచారం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News