: ఎంపీలు, ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణలపై ఏడాదిలోగా తీర్పులు


తమిళనాడు మాజీ ముుఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు పూర్తయ్యేందుకు 18 ఏళ్ల సమయం పట్టింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కేసులో తుది తీర్పు కోసం దాదాపు 17 ఏళ్ల పాటు ఆగాల్సి వచ్చింది. జార్ఖండ్ ముఖ్మమంత్రి మధు కోడాపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు ఇంకా తేలనేలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా చెప్పే పరిస్థితి లేదు. అయితే ఇకపై ఈ తరహా కేసుల్లో ఇరుక్కునే రాజకీయ నేతల భవిత్యవం ఏడాదిలోగా తేలిపోనుంది. ఇందుకోసం దేశంలోని 24 హైకోర్టుల్లో ప్రత్యేకంగా బెంచ్ లు ఏర్పాటు కానున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే తదితర రాజకీయ నేతలపై వచ్చే అవితీని ఆరోపణలను మాత్రమే ఈ బెంచీలు విచారణకు స్వీకరిస్తాయి. దీనికి సంబంధించిన విధివిధానాలను కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, హైకోర్టులకు పంపేందుకు సిద్ధమవుతోంది. విధివిధానాల ప్రకారం సెషన్స్ కోర్టులో నేతల కేసుల దర్యాప్తులో జాప్యం జరుగుతుంటే, సదరు జాప్యానికి కారణమయ్యే, దర్యాప్తును ప్రభావితం చేసే నేతాశ్రీలపై జిల్లా జడ్జి చర్యలు తీసుకునేందుకు అధికారముంటుంది. అంతేకాక కేసు నమోదైన మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి కాని పక్షంలో కేసు నమోదైన స్టేషన్ ఏ జిల్లా పరిధిలోకి వస్తుందో, ఆ జిల్లా ఎస్పీపై కేసు నమోదు చేసే అధికారం కూడా జిల్లా జడ్జికి సంక్రమిస్తుంది. ఈ తరహా విధివిధానాల ఖరారులో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, హోంశాఖను సంప్రదిస్తోంది. త్వరలో ఈ విధివిధానాలు ఖరారు కానున్నాయి.

  • Loading...

More Telugu News