: వైయస్ బతికుంటే జయకు పట్టిన గతే పట్టేదేమో: వీహెచ్
జయలలితకు విధించిన శిక్ష అవినీతికి పాల్పడుతున్న నేతలకు కనువిప్పు కావాలని సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బతికుంటే జయలలితకు పట్టిన గతే పట్టేదేమోనని సందేహం వెలిబుచ్చారు. జగన్ ను మాత్రమే విచారిస్తున్నారని... వైయస్ ఆత్మ కేవీపీపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా లేక ఏ రాజకీయ నేత అయినా జయలలిత తీర్పు తర్వాత ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని సూచించారు. టీఎస్ హోంమంత్రి కావాలనే టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను టార్గెట్ చేశారని... మిగిలిన నేతలను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.