: 8 మంది వైకాపా జడ్పీటీసీలపై అనర్హత వేటు


ఎనిమిది మంది వైకాపా జడ్పీటీసీలకు నెల్లూరు జిల్లా కలెక్టర్ షాక్ ఇచ్చారు. జిల్లాపరిషత్ ఎన్నిక సందర్భంగా విప్ ధిక్కరించినందుకు వారిపై అనర్హత వేటు వేశారు. ఎన్నిక సమయంలో వీరంతా టీడీపీకి మద్దతిచ్చారు. ఈ విషయంపై వైకాపా నేతలు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని అనుసరించి కలెక్టర్ వీరందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఈ ఎనిమిది మంది తమ పదవులను కోల్పోయారు.

  • Loading...

More Telugu News