: తిరుమలలో ఘోరం... పురోహితుడి వద్ద గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
తిరుమలలో విజిలెన్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో, టీటీడీ పురోహిత సంఘం కార్యాలయంలో దాడులు నిర్వహించిన అధికారులకు దిమ్మతిరిగి పోయింది. ఉదయ్ కుమార్ అనే పురోహితుడి వద్ద భారీ సంఖ్యలో గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. దీంతో, ఉదయ్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తును ప్రారంభించారు విజిలెన్స్ అధికారులు.