: సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారు: పొంగులేటి


తెలంగాణలో పరిపాలన అధ్వానంగా తయారయిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ విద్యాసంవత్సరంలో 2 వేల పాఠశాలలను మూసివేశారని... ఇది సరైన చర్య కాదని అన్నారు. భూ కేటాయింపుల పేరుతో ప్రభుత్వ భూములు దుర్వినియోగమయ్యాయని... వీటిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేవలం సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే బతుకమ్మ పండుగను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సంక్షోభంలా మారిందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News