: మా జిల్లాలో బతుకమ్మ సంప్రదాయమే లేదు: డీకే అరుణ


"మా జిల్లా మహబూబ్ నగర్ లో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదు. అలాంటిది అక్కడ బతుకమ్మ ఆడిస్తూ... దానికి కవితను ముఖ్య అతిథిగా పిలవడమేమిటి?" అంటూ మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను జరుపుతోందని... దీన్ని సాకుగా చూపి ప్రజలను చీల్చాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బతుకమ్మ ఆడామని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దసరాకు సెలవులు పెంచి సంక్రాంతికి తగ్గించడం సరికాదని అన్నారు. ఈ రోజు సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News