: స్వర్ణం సాధించిన యోగేశ్వర్ దత్
దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్ మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ 65 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. తజకిస్థాన్ కు చెందిన జలీంఖాన్ యుసుపోవ్ ను 28 ఏళ్ల యోగేశ్వర్ 3-0తో ఓడించాడు. యోగేశ్వర్ గెలుపుతో ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య నాలుగుకు పెరిగింది. 400 మీటర్ల పరుగు పందెంలో ఎంఆర్ పూవమ్మ కాంస్య పతకం సాధించింది. అలాగే, పురుషుల 400 మీటర్ల పరుగు పందెంలో రాజీవ్ అరోకియా కాంస్య పతకం సాధించాడు.