: తిరుమలలో అపచారం... ఐదుగురు అరెస్ట్
అత్యంత పవిత్ర ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమలను కొందరు అపవిత్రం చేస్తున్నారు. భక్తి భావంతో ఏడుకొండలవాడి కరుణాకటాక్షాలు అందుకోవాల్సిన చోట నీచమైన పనులకు ఒడిగడుతున్నారు. తాజాగా తిరుమలలో పేకాట ఆడుతున్న ఐదుగురిని విజిలెన్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. వీరంతా మహారాష్ట్రకు చెందినవారని విజిలెన్స్ అధికారులు తెలిపారు.