: తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం... ఉత్కంఠకు తెర
తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టబోతున్నారు. జయ జైలుకు వెళ్లిన అనంతరం... ఆమె స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. షీలాకు జయ పంపిన సీల్డ్ కవర్ లో పన్నీర్ సెల్వం పేరు ఉండటంతో ఏఐఏడీఎంకే వర్గాలు ఆయన్ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నాయి. దీంతో, తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. 2001లో జయలలిత జైలుకు వెళ్లిన సందర్భంలో పన్నీర్ సెల్వం తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాసేపట్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు గవర్నర్ రోశయ్యను కలిసి పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఆహ్వానించాలని కోరనున్నారు.