: త్వరలో జగన్ కు శిక్షపడక తప్పదు: గంటా
ప్రజాస్వామ్య వ్యవస్థలో అవినీతికి పాల్పడ్డవారు ఎంతటివారైనా సరే జైలుకు పోక తప్పదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అక్రమాస్తుల కేసులో జయలలితకు కోర్టు విధించిన శిక్షను తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ విచారణలో దోషిగా తేలడం ఖాయమని అన్నారు. రూ. 66 కోట్ల అవినీతికి పాల్పడిన జయకు కోర్టు కఠిన శిక్షను విధించిందని... జగన్ కేసులో ఇప్పటికే రూ. 850 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని... సీబీఐ పిటిషన్లలో జగన్ వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారని ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో, జగన్ కు పడబోయే శిక్ష ఇంకెంత కఠినంగా ఉంటుందోనని అన్నారు.