: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శశికపూర్


ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందిన అలనాటి బాలీవుడ్ అందాల నటుడు శశికపూర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 21న ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. "నాన్న క్షేమంగా ఉన్నారు. ఆయన ఇంటికి రావడం ఆనందంగా ఉంది" అని ఆయన కుమారుడు, సినీ నటుడు కునాల్ కపూర్ తెలిపారు. సత్యం శివం సుందరం, కభీ కభీ, దీవార్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన శశికపూర్ 1990 నుంచి నటించడం మానేశారు.

  • Loading...

More Telugu News