: తిరుమలలో భారీ వర్షం... ఇబ్బంది పడుతున్న భక్తులు
ఈ మధ్యాహ్నం తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీంతో, భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సర్వదర్శనం కోసం దాదాపు 28 గంటలు పడుతున్న నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపలు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో నిలుచున్నారు. భారీ వర్షం కురవడంతో వీరంతా తడిసి ముద్దయ్యారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడ్డారు.