: రానున్న మూడు నెలల్లో నిరుద్యోగులకు అపార అవకాశాలు


నిరుద్యోగ యువతకు రానున్న మూడు నెలలు భారీ అవకాశాలను మోసుకురానున్నాయి. దేశంలోని ప్రధాన రంగాలన్నింటిలోనూ కొత్త ఉద్యోగాలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చే అవకాశాలున్నాయని ‘మై హైరింగ్ క్లబ్. కామ్’ సర్వే వెల్లడించింది. తాను సర్వే చేసిన అన్ని రంగాల్లోనూ అదనపు ఉద్యోగాల భర్తీ కార్యక్రమం ప్రారంభం కానుందని ఆ సంస్థ పేర్కొంది. ఎప్పటిలాగే ఈ మూడు నెలల్లోనూ ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన రెండు త్రైమాసికాలతో పోలిస్తే, మూడో త్రైమాసికంలో తమ సంస్థల్లో ఉద్యోగాల సంఖ్య భారీగా పెరగనుందని ఆయా సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఐటీ సెక్టార్ లో 47 శాతం మేర ఉద్యోగాలు పెరిగితే, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో 45 శాతం మేర ఉద్యోగాలు కొత్తగా అందుబాటులోకి రానున్నాయట. ఇక ప్రాంతాల వారీగా పరిశీలిస్తే దక్షిణాదిలోనే అత్యధికంగా 29 శాతం మేర కొత్తగా ఉద్యోగావకాశాలు పెగరనున్నాయని ఆ సర్వే వెల్లడించింది.

  • Loading...

More Telugu News