: సీవీసీ, సీఐసీలకు అధిపతుల నియామకం ఎప్పుడో?


కేంద్ర పాలనలో జవాబుదారీతనాన్ని పాదుకొల్పడంలో కీలక భూమిక పోషిస్తున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (కేంద్ర సమాచార కమిషన్)లు బాసులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. ఇప్పటికే సీఐసీలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. తాజాగా సెంట్రల్ విజిలెన్స్ చీఫ్ కమిషనర్ ప్రదీప్ కుమార్ కూడా పదవీ విరమణ చేశారు. దీంతో సీవీసీలోనూ కమిషనర్ పోస్టు ఖాళీగా మారింది. అయితే ఈ రెండు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు నిబంధనలు అడ్డొస్తున్నాయి. సీవీసీ, సీఐసీ కమిషనర్ల పోస్టులను భర్తీ చేయాలంటే ప్రధాని నేతృత్వంలో ఎంపిక కమిటీ ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ కమిటీలో ప్రధానితో పాటు లోక్ సభలో ప్రతిపక్ష నేత కూడా కీలకం. అయితే ప్రస్తుత లోక్ సభలో ప్రతిపక్ష నేత పదవి లేదు. దీంతో ఎంపిక కమిటీ ఏర్పాటు కావడం దాదాపుగా అసాధ్యం. ఈ నేపథ్యంలో మరింతకాలం పాటు సీవీసీ, సీఐసీలు అధిపతులు లేకుండానే కార్యకలాపాలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News