: జపాన్ లో బద్దలైన అగ్నిపర్వతం... 30 మంది మృత్యువాత


జపాన్ లో శనివారం అగ్ని పర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం లావాలో చిక్కుకుని 30 మంది మృత్యువాత పడ్డారు. జపాన్ లోని నాగానో ప్రాంతంలో ఓంటేక్ పర్వతం శనివారం మధ్యాహ్నం బద్దలై లావాను ఎగజిమ్మింది. దీంతో, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించింది. పర్వతం ఎగజిమ్మిన లావాలో దాదాపు 250 మంది దాకా చిక్కుబడినప్పటికీ చాలా మంది శనివారం రాత్రికి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. దట్టమైన పొగ నేపథ్యంలో శ్వాస పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డ 30 మంది ప్రాణాలొదిలారు. శ్వాస నిలిచిన నేపథ్యంలోనే వారంతా మృతి చెందినట్లు జపాన్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News