: చదలవాడకే టీటీడీ పగ్గాలు?
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ పగ్గాలు మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తికే ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. టీటీడీ పాలకవర్గ కూర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని వినికిడి. చైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి పేరును ఖరారు చేసిన చంద్రబాబు... పాలకమండలి సభ్యులుగా రవిశంకర్, భాను ప్రకాశ్ రెడ్డి, అనంత్ (కర్ణాటక), ఆకుల స్యతనారాయణ, పతివాడ నారాయణ స్వామి, బండారు సత్యనారాయణ మూర్తిలను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు కూడా పాలకవర్గంలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ భేటీలో టీడీపీ పాలకవర్గానికి ఆమోద ముద్ర లభించనుందని ప్రచారం జరుగుతోంది.