: యూపీ సీఎం ఇంటివద్ద మహిళలను ఢీకొట్టిన కారు, ఒకరు మృతి
లక్నోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అధికార నివాసం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మరణించగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. అఖిలేశ్ యాదవ్ నివాసం దిశగా ఓ మహిళ తన శాంట్రో కారుతో వేగంగా దూసుకువచ్చి ఎదురుగా వస్తున్న మహిళలను ఢీకొట్టింది. అనంతరం కారును అక్కడే వదిలేసి పరారైన ఆ మహిళ ఎవరనే విషయం ఇప్పటికీ బహిర్గతం కాలేదు. కారు ఢీకొనడంతో అక్కడికక్కడే 22 ఏళ్ల రజియా మరణించింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వృద్ధురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది.