: జయతో భేటీకి బెంగళూరుకు తమిళనాడు ఉన్నతాధికారుల బృందం


నాలుగేళ్ల జైలు శిక్షకు గురై పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతో భేటీ అయ్యేందుకు ఆ రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం బెంగళూరు బయలుదేరింది. ఓ ప్రైవేట్ విమానంలో బయలుదేరిన ఈ బృందం జైలులో జయలలితతో భేటీ కానుంది. అయితే, భేటీకి గల కారణాలు వెల్లడి కాలేదు. ఈ బృందంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం సలహాదారుగా వ్యవహరిస్తున్న షీలా బాలకృష్ణన్ తో పాటు సీఎం పేషీ కార్యదర్శులు వెంకటరామన్, రామలింగం, సుదలాయ్ కన్నన్ లున్నారు.

  • Loading...

More Telugu News