: సింహ వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో శ్రీవారు సింహ వాహనంపై ఊరేగుతున్నారు. వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా, భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.